మంచు ఫ్యామిలీలో హీరోగా మంచి విష్ణు చాలా సంవత్సరాల నుంచి పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు. తాజాగా భక్తకన్నప్ప అనే కాన్సెప్ట్ తో ఒక సినిమా చేయాలని తన కోరికగా ఉందంటూ తెలియజేస్తున్నారు. తనికెళ్ల భరణి స్క్రిప్ట్ తో కన్నప్ప సినిమాను చేయాలనుకున్న విషయం ఆ తర్వాత కొన్ని కారణాలు చేత సొంతంగానే ఈ సినిమా కథను మొదలుపెట్టారు. ఈ సినిమాలో గెస్ట్ అపీరియన్స్ గా ప్రభాస్ ని కూడా తీసుకోబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది.


తాజాగా ఇప్పుడు మలయాళ నటుడు మోహన్లాల్ సినిమాలో నటింపజేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా మంచు విష్ణు నే ప్రకటించడం జరిగింది. పాన్ ఇండియా ఆపిల్స్ మరింత పెరిగిపోతోంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పలువురు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు కూడా భారీ బడ్జెట్ ఉన్నారు.. అలాంటిది భక్తకన్నప్ప వంటి సినిమా కోసం ఏకంగా మంచు విష్ణు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ సినిమాకి అన్ని కోట్ల రూపాయలు పెడుతూ ఉండడంతో పలువురి నెటిజెన్లు ఇన్ని కోట్లు వసూలు చేయడం అసాధ్యం అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో మంచు విష్ణు నటించిన సినిమాలన్నీ కూడా కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్ను కూడా రాబట్టడం కష్టంగా ఉన్నాయి. మరి మంచు విష్ణు కి కన్నప్ప సినిమా పైన ఉన్న నమ్మకం చూస్తూ ఉంటే ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి కలిగిస్తోంది మొత్తానికి సోషల్ మీడియాలో కన్నప్ప గురించి వస్తున్న ట్రోల్స్ తో పాటు ప్రశంసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఏ మేరకు ఈ సినిమా అభిమానులను నేర్పిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: