
‘సలార్’ వాయిదా పడటంతో ఆ డేట్ ను క్యాష్ చేసుకోవాలని విడుదల అయిన ‘స్కంద’ ‘చంద్రముఖి 2’ ‘పెదకాపు 1’ సినిమాలలో ఏఒక్కటీ సాలిడ్ హిట్ గా మారలేకపోయాయి. ‘దసరా’ నుంచి స్టార్ హీరోల సినిమాల క్యూ ఏ ప్రారభం అవుతూ ఉండటంతో దసరా పండుగ వచ్చేవరకు మిగిలి ఉన్న శుక్రు వారాలలో చిన్న సినిమాల జాతర జరగ బోతోంది.
దానిలో భాగంగా అక్టోబర్ 6న మూకుమ్మడిగా అనేక చిన్న మీడియం రేంజ్ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. అందులో ముఖ్యమైనది సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ఈమూవీ ట్రైలర్ విడుదల అయ్యాక ఈమూవీ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఈసినిమాకు పోటీగా కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ కూడ విడుదల అవుతోంది . ఈ రెండు సినిమాలకు మాలకు పోటీగా తమ తమ సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కు ఇస్తానని నిర్మాత నాగవంశీ ఛాలెంజ్ చేసిన ‘మ్యాడ్’ మూవీపై కూడా అంచనాలు బాగా ఉన్నాయి.
కలర్స్ స్వాతి నవీన్ చంద్ర నటించిన ‘మంత్ ఆఫ్ మధు’ ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అంచనాలు వస్తున్నాయి ఈ కినేమాలు చాలవు అన్నట్లుగా ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలకు పోటీగా నయన తార జయం రవిల ‘గాడ్’ డబ్బింగ్ సినిమా రంగంలోకి దిగుతోంది. ఈ సినిమాలకు మకు పోటీగా బాలీవుడ్ నుంచి ‘మిషన్ రాణిగంజ్’ ‘థాంక్ యు ఫర్ కమింగ్’ సినిమాలు కూడా అక్టోబర్ మొదటి వారంలో వస్తున్నాయి. ఇన్ని సినిమాలు ఒకే సారి విడుదలవుతున్న పరిస్థితులలో ఎన్ని సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు అన్నది ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్న..