
గత కొన్ని సంవత్సరాలుగా నాని నటించిన ‘దేవదాస్’ మూవీ నుండి ‘దసరా’ వరకు చూసుకుంటే నాని సినిమాలలో హిట్ అయినవి కేవలం మూడే మూడు కనిపిస్తాయి. ‘జెర్సీ’ ‘శ్యామ్ శింగరాయ్’ ‘దసరా’ మూవీల బయ్యర్లు మాత్రమే లాభ పడ్డారు కాని మిగతా సినిమాల బయ్యర్లు చాలవరకు నష్టపోయారు అన్న ప్రచారాం ఉంది.
‘దసరా’ మూవీ విజయవంతం అయినప్పటికీ ఆమూవీ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో ఆమూవీ మార్కెట్ విషయాయంలో నిర్మాతలకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి అన్న గాసిప్పులు కూడ వచ్చాయి. ఇప్పుడు నాని లేటెస్ట్ గా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ మూవీ బడ్జెట్ కూడ అనుకున్న స్థాయి దాటిపోవడంతో ఆమూవీ మార్కెటింగ్ విషయంలో కూడ కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కొందరు మాట్లాడు కుంటున్నారు.
వాస్తవానికి గతంలో లా ఒటీటీ సంస్థలు అదేవిధంగా చానల్స్ పోటీ పడి టాప్ హీరోలు అదేవిధంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకు భారీ రేట్లు ఇచ్చి కొనుక్కునే ట్రెండ్ కు చెక్ పెట్టాయి. దీనికితోడు ప్రముఖ ఒటీటీ సంస్థలు అన్నీ తెలుగులో వెబ్ సిరీస్ లు ప్రముఖ నటీనటులతో చేస్తున్న పరిస్తుతులలో గతంలో లా సినిమాల మార్కెటింగ్ మోజుతో నడవడం లేదని అంటున్నారు. నాని తన సినిమాల బడ్జెట్ విషయం పై నియంత్రణ లేకపోతే అతడి సినిమాలకు కూడ కష్టాలు తప్పవు అని అంటున్నారు..