టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ లకు సంబంధించిన మూవీ షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతుంది. ఈ మూవీ మేకర్స్ ప్రస్తుతం మహేష్ బాబు మరియు కొంత మంది ఇతరులపై ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఎన్టీఆర్ , సైఫ్ అలీ ఖాన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన చాలా ముఖ్యమైన సన్నివేశాలను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: