తెలుగు సినిమా నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన మోస్ట్ క్లాసికల్ మూవీలలో జెర్సీ సినిమా కూడా ఒకటి..ఈ సినిమా ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది.. ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టేలా చేశారు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమా కథను తెరకెక్కించడం జరిగింది.నాని కూడా ఇందులో ఎమోషనల్ గా అద్భుతమైన నటనను పర్ఫామెన్స్ చేశారు. నాని కెరియర్ లోనే జెర్సీ సినిమా ఒక స్పెషల్ గా మారిపోయింది.


ముఖ్యంగా అనిరుద్ ఈ సినిమాకి స్పెషల్ గా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేశారు.. నాని అభిమానులకే కాకుండా సినీ ప్రేక్షకులకు కూడా చాలామందికి జెర్సీ సినిమా స్పెషల్ అని చెప్పవచ్చు ఇలాంటి సినిమా కొన్ని సెంటర్లలో నష్టాలను మిగిల్చింది అనగానే హీరో నాని ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.. హాయ్ నాన్న సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో నాని మీడియాతో మాట్లాడడం జరిగింది.. ఆ సమయంలో ఒక రిపోర్టర్ మీరు మంచి సినిమాలు చేస్తున్నారు.. కానీ బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదు ఎందుకని జెర్సీ సినిమా కూడా కొన్ని సెంటర్లలో నష్టాలు వచ్చాయని అడిగాడు..


ఇందుకు నాని ఆన్సర్ ఇస్తు ఏ ప్రొడ్యూసర్ నుంచి నా సినిమాకు నష్టాలు అనే మాటే రాలేదు.. జెర్సీ సినిమాకి పది పెడితే 50 తెచ్చింది.. ఈ సినిమా బిజినెస్ వెనకాల చాలా లెక్కలు ఉన్నాయంటూ కాస్త గట్టిగానే సమాధానాన్ని ఇచ్చారు. ఇదే సమయంలో జెర్సీ సినిమా ప్రొడ్యూసర్ నాగవంశం కూడా ట్విట్ చేస్తూ.. జెర్సీ సినిమా తన బ్యానర్ నుంచి వచ్చిన బెస్ట్ మూవీ అని సీతారాం నుంచి వచ్చిన మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాలలో ఇది కూడా ఒకటని జెర్సీ సినిమా నేషనల్ వైడిగా చాలా గౌరవాన్ని కూడా తీసుకువచ్చిందని క్రియేటివ్ గా కమర్షియల్ గా ఈ సినిమా సాటిస్ఫై చేసిందంటూ  ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: