ఇలాంటి పరిస్థితుల మధ్య అతడు నటించి నిర్మించిన ‘చిన్నా మూవీకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించినప్పటికి ఆసినిమాను తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోకపోవడం ఫిలిమ్ ఇండస్ట్రి వర్గాలకు షాకింగ్ న్యూస్ గా మారింది. గతంలో తరుణ్ ఉదయ్ కిరణ్ లాంటి చాలమంది హీరోలు మొదట్లో విపరీతంగా రైజ్ అయి ఆతరువాత కాలంలో కనుమరుగు అయినట్లుగా సిద్ధార్థ్ కు కూడ ఇదే పరిస్థితి పడుతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా చూశాక ఈమూవీ బాగా లేదు అని చెపుతున్నవారు లేనప్పటికీ ఈమూవీ కలక్షన్స్ చాల తక్కువగా ఉంటున్నాయి. సిద్ధు ను చూసేందుకు థియేటర్లకు రాము అని ప్రేక్షకులు చెపితే మళ్లీ తాను హైదరాబాద్ కే రానని ఎమోషనల్‌గా సిద్ధార్థ్ ఈమూవీ ఫంక్షన్ లో అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమూవీ ఫ్లాప్ అయినట్లు సంకేతాలు వస్తున్న పరిస్థితులలో ఈమూవీ పరిస్థితి అయోమయంగా కనిపిస్తోంది.
వాస్తవానికి ‘చిన్నా’ చాలా మంచి సినిమా పిల్లల మీద లైంగిక వేధింపుల నేపథ్యంలో చాలా ఇంటెన్స్‌గా ఈ సినిమాను తీసినప్పటికి ఈ మూవీ ప్రమోషన్ చూసి కనీస సంఖ్యలో కూడ ఈ మూవీ ధియేటర్ల వైపు జనం రాకపోవడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఈ మూవీ ఇచ్చిన షాక్ తో ఈ మూవీ రిలీజ్‌కు ముందు సిద్దార్థ్ ఛాలెంజ్ చేసినటట్లుగా ఇక అతడు తెలుగు సినిమాల వైపు కన్నెత్తి చూడడా అన్నసందేహాలు కొందరికి వస్తున్నాయి. అదే జరిగితే తెలుగు సినిమాకు ఒక మంచి నటుడు దూరం అయినట్లు భావించాలి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి