ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె భారతీయ చలనచిత్ర నటి మాత్రమే కాదు.. ఒక మోడల్ , నృత్య కళాకారిణి, టీవీ వ్యాఖ్యాత కూడా.. ఎక్కువగా హిందీ సినిమాలలో నటించిన మలైకా అరోరా 2008లో ఈమె మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్ పేరుతో చిత్ర నిర్మాణాన్ని కూడా మొదలు పెట్టింది. ఇక ఇప్పటికే ఈ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాను నిర్మించింది.

 ఇకపోతే 1973 అక్టోబర్ 23వ తేదీన మహారాష్ట్రలోని థానే లో జన్మించింది. ఇక మలైకా అంటే స్వాహిలి భాషలో దేవత అని అర్థమట. ఇకపోతే మలైకా అరోరాకు 11 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈమె తల్లి దండ్రులు విడాకులు తీసుకోగా అనంతరం ఆమె తల్లి సోదరి అమృత ఆరోరాతో కలిసి చెంబూరికి మఖాం మార్చింది . ఇక ఈమె తల్లి జాయ్స్ పాలికార్స్ మలయాళీ క్యాథలిక్ కాగా తండ్రి అనిల్ అరోరా పంజాబీ వ్యాపారవేత్త. ఇక ఈయన భారత సరిహద్దు పట్టణమైన ఫాజిల్కా నుండి పంజాబీ హిందువుగా వచ్చారు. అంతేకాదు ఈయన మర్చంట్ నేవీలో కూడా పనిచేశారు.

మలైకా అరోరా విద్యాభ్యాసం విషయానికి వస్తే. ప్రాథమిక మాధ్యమిక విద్యను చెంబూరు లోని స్వామి వివేకానంద పాఠశాలల పూర్తి చేసిన ఈమె తన కళాశాల విద్యను జైహింద్ కాలేజ్ చర్చి గేటు నుండి చేసింది కానీ వృత్తిపరమైన నిశ్చితార్థాల కారణంగా దానిని పూర్తి చేయలేకపోయింది.  ఇక మోడలింగ్ వృత్తిని ప్రారంభించే ముందు బసంత్ టాకీస్ సరసన చెంబూర్ లోని బోర్లా సొసైటీలో కూడా నివసించింది. మోడలింగ్ ద్వారా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె కొద్ది రోజుల తర్వాత టీవీ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించండి అలా తనలో ఉన్న అన్ని కోణాలను బయటకు పెట్టి తన ప్రతిభ ఏంటో నిరూపించుకుంది. ఇక ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD