టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటువంటి మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ లు రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 2 రోజుల్లో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను అందుకుంది అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి 2 రోజుల్లో నైజాం ఏరియాలో 2.54 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 1.10 కోట్లు , యుఏ లో 74 లక్షలు , ఈస్ట్ లో 60 లక్షలు , వెస్టు లో 37 లక్షలు , గుంటూరు లో 80 లక్షలు , కృష్ణ లో 44 లక్షలు , నెల్లూరు లో 28 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.78 కోట్ల షేర్ ... 11.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి రెండు రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 75 లక్షల కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 85 లక్షల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ సినిమాకి 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 8.38 కోట్ల షేర్ ... 15.10 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి వరల్డ్ వైడ్ గా 37.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... 38.50 కోట్ల టార్గెట్ తో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇకపోతే ఈ మూవీ మరో 30.12 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా సాధించినట్లు అయితే క్లీన్ హీట్ గా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: