కాజల్ అగర్వాల్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కాజల్. అలాంటి కాజల్ ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తాను అని క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.  ఒకప్పటిలా గ్లామర్ పాత్రలు చేసే ఉద్దేశం లేదు అని దర్శక నిర్మాతలకి ఖరాఖండిగా చెప్పేస్తుంది. కేవలం పాటల కోసం మాత్రమే తీసుకునే హీరోయిన్ పాత్రలను ఒప్పుకొను అని తనని సంప్రదిస్తున్న దర్శక నిర్మాతలకి క్లారిటీ ఇస్తోందట. 

నటించడానికి స్కోప్ ఉండే పాత్రలు మాత్రమే కావాలని అలాంటి పాత్రలు ఉంటేనే నా దగ్గరికి రండి అని అటువంటి కథలో ఉంటే మాత్రమే చేస్తాను అని తనని సంప్రదించిన దర్శక నిర్మాతలకి చెబుతోంది. అంతేకాదు అలాంటి కథలు ఉంటేనే తనని సంప్రదించాలి అని చెబుతోంది. రీఎంట్రీలో ఆమె భారతీయుడు-2లో నటించింది. ఇక సత్యభామ అనే మహిళా ప్రాధాన్యం ఉన్న సినిమా కూడా చేస్తోంది. ఈ రెండు సినిమాల్లో తన పాత్రలు చాలా బాగుంటాయని చెబుతోంది కాజల్. భారతీయుడు-2 కోసం కేరళకు చెందిన ప్రాచీన యుద్ధ కళను నేర్చుకుందట కాజల్. 

ఇక సత్యభామ కోసం మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుందట కాజల్ అగర్వాల్  . అలా తనకి నచ్చిన పాత్ర కోసం ఎంత కష్టపడడానికైనా రెడీగా ఉంది కాజల్. అందుకే మంచి పాత్రలతో తనను సంప్రదించాలి అని దర్శక నిర్మాతలకి చెబుతోంది. ఇక ఇటీవల నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాత్యాయని అని ఒక సైకాలజిస్ట్ పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఈ పాత్ర తనకి పెద్దగా పేరుని తీసుకురాలేదు. అందుకే ఇకపై అటువంటి పాత్రలు తన దగ్గరికి తీసుకురావద్దు అని పరోక్షంగా హింట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: