

ఆ తర్వాత ఆయన బిజినెస్ వైపుగా అడుగులు వేస్తూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో ఒక కర్రీ పాయింట్ను సైతం మొదలుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి ఆయన ఇప్పుడు సైలెంట్గా వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకొని తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లి ఈ రోజున బంధువుల మిత్రుల సమక్షంలో చాలా ఘనంగా వైజాగ్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. అయితే గత ఏడాది వీరిద్దరికి సంబంధించి ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు సమాచారం.
కిరాక్ ఆర్పి ప్రేమించిన అమ్మాయి వివాహం చేసుకున్న అమ్మాయి పేరు లక్ష్మీ ప్రసన్న ఈ అమ్మాయి తో మూడేళ్లు ప్రేమలో మునిగి తేలిన కిరాక్ ఆర్పి ఈ రోజున వివాహ బంధంతో ఒకటయ్యారు. తమ కుటుంబ సభ్యుల సమక్షంలో వేరే వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగినట్టు తెలుస్తోంది అంతేకాకుండా వీరి పెళ్లికి పలువురు సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ భార్య లక్ష్మీ ప్రసన్న ఒక ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నట్లు సమాచారం ఈ అమ్మాయిని చూసి ఇష్టపడిన కిరాక్ ఆర్పి ఈ ఏడాది వివాహ బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం వీరి వివాహం ఫోటోలు వైరల్ గా కావడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.