రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 వ తేదీన విడుదల కావడానికి రెడీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను ... పాటలను విడుదల చేయగా వాటికి అద్భుతమైన రెస్పాన్స్ ఇండియా వ్యాప్తంగా జనాల నుండి లభించింది.

ఇక ఇప్పటికే అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ లాంటి వరుస విజయాల తర్వాత సందీప్ దర్శకత్వం వహించిన మూవీ కావడం ... రన్బీర్ కపూర్ లాంటి అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడు ఈ మూవీ లో హీరోగా నటించడం తో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇకపోతే భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ కి భారీ ధరకు అమ్మి వేసినట్లు అందులో భాగంగా ఈ మూవీ యొక్క థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో నెట్ ఫ్లిక్స్ వారు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఏ విధమైన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ఈ మూవీ 3 గంటల 21 నిమిషాల 16 సెకండ్ ల భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: