తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న శ్రీకాంత్ తాజాగా "కోట బొమ్మాలి పి ఎస్" అనే సినిమాలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ తాజాగా మంచి అంచనాల నడుమ భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకొంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి 5 రోజుల్లో నైజాం ఏరియాలో 1.18 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5 రోజుల్లో 2.83 కోట్ల షేర్ ... 5.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లో కలుపుకొని 54 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.37 కోట్ల షేర్ ... 6.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ సినిమా 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ మరో 13 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని వరల్డ్ వైడ్ గా క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రాహుల్ విజయ్ , వరలక్ష్మి శరత్ కుమార్ , శివాని రాజశేఖర్ , మురళీ శర్మ ముఖ్య పాత్రలలో నటించగా తేజ మార్ని ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. బన్నీ వాస్ ,  విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమాకి రంజిన్ రాజ్ సంగీతం అందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: