థియేటర్ లలో విడుదల అయ్యే ప్రతి సినిమాకు సెన్సార్ బోర్డు దానిలో ఉన్న వైలెన్స్ ను బట్టి ... రక్తపాతాన్ని బట్టి ... రొమాన్స్ ను బట్టి సర్టిఫికెట్ లను జారీ చేస్తూ ఉంటుంది. సినిమాలో భారీ రొమాన్స్ ఉన్న లేదా రక్తపాతం ఉన్నా కానీ ఆ సినిమాలకు "ఏ" సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు ఇండియాలో జారీ చేస్తూ ఉంటుంది. ఇక అందులో భాగంగా "ఏ" సర్టిఫికెట్ వచ్చిన సినిమాలకు చిన్నపిల్లలను తీసుకువెళ్లడానికి వీలులేదు. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎక్కువగా ఈ సినిమాలను చూడడానికి ఇష్టపడరు. దానితో ఈ సర్టిఫికెట్ వచ్చిన మూవీలు బాగున్నప్పటికీ వీటికి కలెక్షన్ లు కాస్త తక్కువగానే వస్తూ ఉంటాయి. కానీ ఈ సర్టిఫికెట్ వచ్చినా కూడా ఇండియాలో కొన్ని భారీ కలక్షన్ లను వసూలు చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో టాప్ 5 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తాజాగా డిసెంబర్ 1 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ సినిమా విడుదల అయిన కేవలం నాలుగు రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్ లను రాబట్టింది. ఈ మూవీ లాంగ్ రన్ లో భారీ కలెక్షన్ లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కబీర్ సింగ్ : షాహిద్ కపూర్ హీరోగా కియార అద్వానీ హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 375 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ది కాశ్మీరీ ఫైల్స్ : సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 340 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

డి కేరళ స్టోరీ : సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఓఎంజి 2: సెన్సార్ బోర్డు నుండి "ఏ" సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 220 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: