
అయితే ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉండేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. ఇప్పుడు తాజాగా కన్నడలో స్టార్ హీరోగా పేరుపొందిన యష్ తో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా కంటే ముందుగా నాగచైతన్య తో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న తండేల్ అనే చిత్రంలో ఈమె హీరోయిన్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దాదాపుగా హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ అందుకుంటోంది అనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి.
ఇలా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఫుల్ ఖుషిగా అభిమానులను చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి వివాహం చేసుకోబోతోంది అనే రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి.. కానీ ఇలాంటి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నది. అయితే సాయి పల్లవి సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సాయి పల్లవి డాక్టర్ కోర్స్ చదువుతున్నది కనుక అందుకు సంబంధించిన పనిలో ఇమే బిజీగా ఉన్నదని అందుకే కాస్త సినిమాలు ఆలస్యంగా ఒప్పుకుంటోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వరుస సినిమాలతో సాయి పల్లవి గేమ్ మొదలుపెట్టింది అంటూ పలువురు అభిమానులు తెలుపుతున్నారు.