నందమూరి బాలకృష్ణ ... విజయ్ దేవరకొండ ... దుల్కర్ సల్మాన్ ... రష్మిక మందన ప్రస్తుతం తమ తమ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం వీరు ఏ సినిమాలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అనే విషయాలను తెలుసుకుందాం.

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి టైటిల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఊటీలో బాలకృష్ణ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మరణాలు ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం న్యూయార్క్ లో విజయ్ దేవరకొండ ... మృణాల్ ఠాకూర్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన ప్రస్తుతం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం హైదరాబాద్  లో రష్మిక పై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: