యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమా యొక్క మొదటి భాగం విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ రోజు అనగా జనవరి 8 వ తేదీన ఈ సినిమా యొక్క గ్లీమ్స్ వీడియోను విడుదల చేయనున్నట్లు చాలా రోజుల క్రితమే ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. 

ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క గ్లీమ్స్ వీడియోను కూడా తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , మలయాళ భాషలో విడుదల చేయనున్నట్లు ప్రకటించడం మాత్రమే కాకుండా ఏ భాష టీజర్ ఏ యూట్యూబ్ ఛానల్ లో విడుదల కాబోతుంది అనే విషయాన్ని కూడా ప్రకటించారు. ఈ మూవీ యొక్క తెలుగు గ్లీమ్స్ వీడియో యువ సుధా ఆర్ట్స్ చానల్లో ప్రసారం కానుండగా , హిందీ యొక్క వీడియో టి సిరీస్ లో ప్రసారం కానుంది. తమిళ్ యొక్క గలిమ్స్ వీడియో టి సీరియస్ తమిళ్ లోను , కన్నడ యొక్క గ్లీమ్స్ వీడియో జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ ఛానల్ లో , మలయాళం యొక్క గ్లిమ్స్ వీడియో ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫిషియల్ ఛానల్ లో ప్రచారం కానుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాకు విలన్ గా నటిస్తున్నాడు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: