సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొన్ని రోజుల్లో గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమనులు మీనాక్షి చౌదరి , శ్రీ లీలా ఈ సినిమాలో మహేష్ కి జోడి గా నటించారు. రమ్య కృష్ణ , జయరామ్ , ప్రకాష్ రాజ్ , రావు రమేష్మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... చిన బాబు , సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన దాదాపు అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం వాస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా బారి లెవల్లో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో దాదాపుగా 42 కోట్ల ప్రి బిజినెస్ జరగగా , సీడెడ్ ఏరియాలో 14 కోట్లు , ఉత్తరాంధ్ర ఏరియాలో 14.5 కోట్లు , ఈస్ట్ గోదావరి లో 8.8 కోట్లు , గుంటూరు లో 7.8 కోట్లు , వెస్ట్ గోదావరి లో 6.5 కోట్లు , కృష్ణ లో 6.5 కోట్లు , నెల్లూరు లో 4 కోట్లు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 104.1 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.5 కోట్లు , ఓవర్సీస్ లో 21 కోట్లు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 134.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తుంది. దానితో ఈ సినిమా 136 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: