టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరు సంపాదించింది హీరోయిన్ రష్మిక.. దాదాపుగా తెలుగు ,తమిళ్, హిందీ వంటి భాషలలో పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా బారి క్రేజ్ ను అందుకుంది. ఇటీవల పలు లేడి ఓరియంట్ చిత్రాలలో కూడా నటిస్తోంది. గత కొద్ది రోజులుగా హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపిస్తూనే మరికొన్నిచోట్ల సింక్ అయ్యే విధంగా కనిపిస్తూ ఉంటారు. ఈ ఏడాది వివాహం కూడా చేసుకోబోతున్నారనే రూమర్స్ సైతం వినిపించాయి.


అయితే ఈ విషయం పైన విజయ్ దేవరకొండ టీ క్లారిటీ ఇవ్వడం జరిగింది.. ఇవన్నీ కేవలం రూమర్సే అంటూ తెలిపారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనకు విజయ్ దేవరకొండ కంటే జూనియర్ ఎన్టీఆర్ అంటేనే చాలా ఇష్టం అన్నట్లుగా తెలియజేసినట్లు తెలుస్తోంది. తనతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ తన మనసులో మాటగా తెలిపింది ఈ ముద్దుగుమ్మ.. ఎన్టీఆర్ నటన డాన్స్ అంటే చాలా ఇష్టమని తెలియజేసింది.

ప్రస్తుతం రష్మిక సినిమాల విషయానికి వస్తే పుష్ప-2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో అద్భుతంగా అలరించిన ఈ ముద్దుగుమ్మ పార్ట్ 2 లో కూడా మరింత అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. నిరంతరం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు రకాల బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాన్ ఇండియా హీరోయిన్గా మంచి క్రేజీ సంపాదించుకున్న రష్మిక మరి జూనియర్ ఎన్టీఆర్ తో నటించే అవకాశాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: