సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహేష్ "గుంటూరు కారం" అనే ఫ్యామిలీ ప్లస్ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాకు రెండు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను తెలుసుకుందాం.

మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 28.25 కోట్ల కలెక్షన్ లు దక్కగా ,  సిడెడ్ ఏరియా లో 6.98 కోట్లు ,  ఉత్తరాంధ్ర లో   7.36 కోట్లు , ఈస్ట్ లో 5.98 కోట్లు , వెస్ట్ లో 3.91 కోట్లు , గుంటూరు లో 6.47 కోట్లు , కృష్ణ లో 4.59 కోట్లు , నెల్లూరు లో 2.59 కోట్ల కనెక్షన్ లను రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి 66.13 కోట్ల షేర్ ... 96.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా ... శ్రీ లీల , మీనాక్షి చౌదరిమూవీ లో మహేష్ కి జోడి గా నటించారు. 


రమ్య కృష్ణ , జయరామ్ , రావు రమేష్ , ప్రకాష్ రాజ్ , రాహుల్ రవీంద్రన్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. విడుదల అయిన మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా మహేష్ కి ఉన్న క్రేజ్ తో అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: