ఇక త్రివిక్రమ్ తర్వాత రైటర్ నుంచి డైరెక్టర్ గా మారిన వారిలో కొరటాలు శివ రెండవ స్థానంలో ఉంటారు అని చెప్పాలి. కొరటాల శివ ముందుగా రైటర్ గా పనిచేసి ఇతర దర్శకులకు ఈ కథలను అందించేవాడు. కానీ ఆ తర్వాత దర్శకుడిగా అవతారం ఎత్తాడు. అయితే అతని దర్శకుడుగా రావడానికి కారణం కూడా లేకపోలేదు. రైటర్ గా ఉన్నప్పుడు చాలామంది తనకు అన్యాయం చేశారనే ఉద్దేశంతో దర్శకుడిగా మారినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఏకంగా ఒక దర్శకుడు తన దగ్గర నుంచి కథలను నొక్కేసి కనీసం తన పేరును కూడా వేయకుండా మోసం చేశాడట.
ఆద ర్శకుడు ఎవరో కాదు గతంలో కొరటాల శివ స్నేహితుడిగా ఉన్న బోయపాటి నేనట. అప్పట్లో కొరటాల శివ కథలతోనే బోయపాటి ఎన్నో సినిమాలు చేశాడు అంటూ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు వచ్చాయి. ఇక ఇలా బోయపాటి తన కథలను నొక్కేసి తనకు అన్యాయం చేశాడు అన్న కారణంతోనే ఇక కొరటాల ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి కసితో హిట్టు కొట్టాడు అంటూ వార్తలు వచ్చాయి. బోయపాటి తీసిన భద్ర అలాగే సింహా సినిమాల కొరటాల స్టోరీలే అంటూ ఎన్నో వార్తలు మీదికి వచ్చాయి. మరి ఇందులో ఏది నిజం అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి