దీంతో ఓటీటి నుంచి ఈ సినిమాని తొలగించారు. దీంతో ప్రముఖ ఓటీటి ప్లాట్ఫారం నెట్ ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని రిమూవ్ చేసింది.ఈ వివాదం కొంతమంది సినీ ప్రముఖులు నయనతార కి మద్దతుగా ఉండగా అటు రాజకీయ నాయకుల నుంచి చిత్ర యూనిట్ పైన చాలా ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు.అన్నపూరణి సినిమా వివాదం పైన నయనతార స్పందిస్తూ.. తాను కానీ తన టీమ్ కాని ఎవరి మనోభావాలను సైతం దెబ్బతీయాలని లేదని తన సినిమాపై నెలకొన్న వివాదం పైన క్షమాపణలు తెలియజేసింది నయనతార.
ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ లో జై శ్రీరామ్ అంటూ కూడా ఒక విషయాన్ని తెలిపింది.. గత కొద్దిరోజులుగా తన సినిమా పైన చర్చనీయాంశంగా మారుతోంది .ఈ విషయం పైన బరువెక్కిన హృదయంతో ఇలాంటి ప్రకటన చేస్తున్నానంటూ తెలిపింది..అన్నపూరణి సినిమా కేవలం కమర్షియల్ ఉద్దేశంతోనే కాకుండా ప్రజలలోకి ఒక మంచి ఆలోచన తీసుకువెళ్లాలని ప్రయత్నం చేశాను ఏదైనా దృఢ సంకల్పంతో పోరాడితే కచ్చితంగా సాధించవచ్చు అనే కథాంశంతో ఆలోచనతోనే ఈ సినిమాను చేశాను.. అయితే మాకు తెలియకుండానే కొంతమంది మనసులను గాయపరిచాయని తెలిసింది.. సెన్సార్ సభ్యులు ఓకే చేసి థియేటర్లో విడుదలైన సినిమా ఓటిటి నుంచి రిమూవ్ చేయడంతో ఆశ్చర్యపోయాను.. అందుకే ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నానంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి