టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి 2002 వ సంవత్సరం ఇంద్ర అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బి గోపాల్ దర్శకత్వం వహించగా ... సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ ఈ సినిమాలో చిరంజీవి కి జోడి గా నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ... వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు.

 ఇకపోతే 2002 వ సంవత్సరం జూలై 24 వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్ లను వసూలు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత బుల్లి తెరపై కూడా ఎన్నో సంచాలనాలను నమోదు చేసింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాక తాజాగా ఈ మూవీ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అయింది.

 ఇకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకు బుల్లి తెర ప్రేక్షకుల నుండి అభిమానం ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా తాజాగా జీ తెలుగు ఛానల్లో ప్రసారం కాగా ఈ మూవీ కి ఏకంగా 5.59 "టి ఆర్ పి" రేటింగ్ వచ్చింది. ఒక విధంగా చూసుకుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ సినిమాకు ఈ రేంజ్ "టి ఆర్ పి" రావడం అనేది అదిరిపోయే రెస్పాన్స్ ఈ సినిమాకు జనాల నుండి లభించింది అని చెప్పవచ్చు. ఇలా ఇంద్ర సినిమా విడుదల అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ సినిమాపై జనాలకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు అని దీనిని బట్టి స్పష్టంగా అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: