తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ముఖ్యంగా మహేష్ బాబు నమ్రతల కూతురు సితార సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలను సైతం తెలియజేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పలు రకాల పాటలకు డ్యాన్సులు వేస్తూ వాటిని షేర్ చేయడమే కాకుండా ఫెస్టివల్ కు తనదైన స్టైల్ లో కనిపిస్తూ ఉంటుంది సితార. ఇటీవల మహేష్ నటించిన గుంటూరు కారం సినిమాలోని ఒక పాటకు సితార డాన్స్ వేసి ఆ వీడియోని షేర్ చేయడం జరిగింది.


ఈ పాటకు డాన్స్ వేసిన సితార స్టెప్పులను చూసి మహేష్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. సితార చేసేటువంటి ఈ డ్యాన్సులు చూస్తే భవిష్యత్తులో హీరోయిన్గా రాబట్టే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.తన వీడియోలను చూసి మహేష్ అభిమానులు కూడా వావ్ అనకుండా ఉండలేరు.. గుంటూరు కారం సినిమాలోని ట్రిప్పింగ్.. ట్రిప్పింగ్ అనే పాటకు సైతం సితార డాన్స్ తో అదరగొట్టేసింది.


మహేష్ బాబు ఇంట్లో జరిగిన గుంటూరు కారం సక్సెస్ పార్టీల మహేష్ కూతురు సితార చాలా అట్రాక్టివ్ గా కనిపించింది టీమ్ అందరితో కలిసి సందడి చేసిన సితార చిన్న వయసులోనే యూట్యూబ్ ఛానల్ రన్ చేసి.. ఒక జువెలరీ సంస్థకు కూడా బెరాండ్ అంబాసిడర్ గా మారిన సితార ఇంతవరకు ఏ స్టార్ కిడ్ అందుకో నటువంటి రికార్డులను అందుకుంటుంది. అంతేకాకుండా ఈ డబ్బులను ఒక ట్రస్టుకు కూడా ఇచ్చేసినట్లు తెలియజేసింది. దీంతో ఈ విషయం విన్న చాలా మంది సెలబ్రెటీలు కూడా సీతార నీ అభినందించారు. ఇప్పుడు తాజాగా ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు సైతం సీతార ను ప్రశంసలతో ముంచేస్తున్నారు.. తండ్రికి తగ్గ కూతురు అనిపించుకున్నావంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: