తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో తలపతి విజయ్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో తమిళ సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకొని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన ఆఖరుగా లియో అనే సినిమాలో హీరోగా నటించాడు. లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న "గోట్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ఈయన కొంత కాలం క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు బ్యానర్ లో వారిసు అనే సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశి పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఇలా ఇప్పటికే ఓ తెలుగు నిర్మాణ సంస్థలో ఓ సినిమా చేసిన విజయ్ మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన మరో నిర్మాణ సంస్థలో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... టాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న v v DANAIAH' target='_blank' title='డి వి వి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డి వి వి దానయ్య ఇప్పటికి ఎన్నో సినిమాలను డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈయన తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ తో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ కూడా ఈ బ్యానర్ లో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అందులో భాగంగా ప్రస్తుతం దానయ్య , విజయ్ సినిమా కోసం ఓ క్రేజీ దర్శకుడిని వెతుకుతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: