ఈ చిత్రానికి శ్రీరామరక్ష అనే టైటిల్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోయిన్లను తీసుకోబోతున్నారు. ముఖ్యంగా నయనతార నటిస్తూ ఉండగా ఈ చిత్రంలో మరొక హీరోయిన్ శృతిహాసన్ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరు హీరోయిన్లతో రాఘవ లారెన్స్ జోడి కట్టడం ఇదే మొదటిసారి.. అయితే ఈ నెల 14న ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది హర్రర్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో కచ్చితంగా ఈ సినిమా మరొకసారి ప్రేక్షకులను మెప్పిస్తుందని అభిమానులు భావిస్తున్నారు.
రాఘవ లారెన్స్ కి హర్రర్ సినిమాలు ఎక్కువగా వర్క్ అవుట్ అవుతాయి. ఈ సినిమాలే కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ని రాబట్టాయి. మళ్లీ ఈ జోనర్ తో తన హిట్ కొట్టాలని చూస్తున్న రాఘవ లారెన్స్ కు మరి శ్రీరామరక్ష అని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి.. ఈ చిత్రానికి సంబంధించి ఈ స్టార్ హీరోయిన్స్ రాఘవ లారెన్స్ తో నటించడానికి ఒప్పుకుంటారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా షూటింగ్ మొదలైతే విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి