అర్జున్ రెడ్డి, యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గామి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తర్వాత బయటకు రాగానే అందరూ ఒకే ప్రశ్నను అడిగేశారు.. ముఖ్యంగా రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమా ఎప్పుడు మొదలవుతుందని కొంతమంది మీడియా వారు ఆయన్ని ప్రశ్నించగా.. అందుకు సమాధానంగా సందీప్ రెడ్డి వంగ ఇలా మాట్లాడుతూ.. ముందుగా గామి ట్రైలర్ చాలా బాగుంది.. ఆరేళ్లపాటు ఒకే సినిమా కోసం అంకితం అవడం అంటే అది మామూలు విషయం కాదు.. యాక్టర్స్, డైరెక్టర్స్, నిర్మాతలకు చాలా ఓపిక ఉంటేనే ఇది సాధ్యమవుతుందని తెలిపారు.ఇక ప్రభాస్ తో చేసే స్పిరిట్ సినిమా గురించి చెబుతూ ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలిపారు..స్పిరిట్ సినిమా పాన్ ఇండియా సినిమా అని.. ప్రస్తుతం ఈ సినిమా పనులలో చాలా బిజీగా ఉన్నామని.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయని సందీప్ తెలిపారు..అయితే ఈ సినిమా హర్రర్ మూవీ కాదని ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథలో ప్రభాస్ సరికొత్తగా కనిపించబోతున్నారని వెల్లడించారు.


మొదటిసారి ప్రభాస్ ఖాకీ దుస్తులలో కనిపించబోతున్నారని అభిమానులు చాలా ఖుషీ అవుతున్నారు.నిజానికి స్పిరిట్ సినిమా అనౌన్స్ చేసి ఇప్పటికి ఎన్నో నెలలు గడిచినా ఇప్పటి దాకా ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.. తాజాగా సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ అభిమానులను బాగా ఖుషి అయ్యేలా చేస్తున్నాయి. మొత్తానికి  ప్రభాస్ సరికొత్త గెటప్ లో కనిపించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఇక యానిమల్ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పెద్ద పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఏకంగా 930 కోట్లు వసూళ్లు రాబట్టి నిర్మాణ సంస్థ టీ సిరీస్ కి భారీ లాభాలని తెచ్చిపెట్టింది.ఈ సినిమాకి సీక్వెల్ గా యానిమల్ పార్క్ కూడా వస్తుంది. అయితే ఈ సినిమా కంటే ముందు స్పిరిట్ సినిమా పూర్తి చేసే పనిలో పడ్డాడు సందీప్ రెడ్డి వంగ.మరి చూడాలి స్పిరిట్ ఎన్ని రికార్డులు బద్ధలు కొడుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: