తెలుగు సినీ పరిశ్రమలో నటుడి గా , నిర్మాత గా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో కళ్యాణ్ రామ్ ఒకరు. ఇకపోతే ఈయన తాజాగా డెవిల్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా ... అభిషేక్ నామ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈయనే స్వయంగా అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో ఆకట్టుకుంది. ఇలా ధియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ఈ టీవీ సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చి 10 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఈ టీవీ సంస్థ తాజాగా ఆధికారికంగా ప్రకటించింది. మరి ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను పర్వాలేదు అనే స్థాయిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఈ మూవీ లోని కళ్యాణ్ , సంయుక్త నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kr