విలక్షణ నటుడు రావు రమేష్ గత రెండు దశాబ్ధాలుగా తెలుగు సినిమాలలో ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి. ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రావు రమేష్ ఇప్పటివరకు చిరంజీవి నటించిన సినిమాలలో విలన్ గా కనిపించిన సందర్భాలు లేవు.గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి పక్కన విలన్ గా నటించి మెప్పించలేకపోయాను అన్న కోరిక రావు రమేష్ కు ఉందట. ఈవిషయాన్ని స్వయంగా ఈ విలక్షణ నటుడు చిరంజీవికి చెప్పడంతో మెగా స్టార్ అతడి కోరికను ‘విశ్వంభర’ మూవీలో తీరుస్తున్నాడు. ఈమూవీలో అత్యంత కీలకమైన మాంత్రికుడి పాత్రకు చిరంజీవి సలహాతో దర్శకుడు వశిష్ఠ రావు రమేష్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరంజీవి రావు రమేష్ పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాలను ఒక భారీ సెట్టింగ్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి చిరంజీవి కెరియర్ లో నటించిన అనేక బ్లాక్ బష్టర్ మూవీలలో రావు రమేష్ తండ్రి రావుగోపాలరావు విలన్ గా నటించి చిరంజీవి పక్కన రాణించిన విషయం తెలిసిందే. ఆరోజులలో చిరంజీవి సినిమాలలో చిరంజీవి రావుగోపాలరావు అల్లు రామలింగయ్య కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలెట్ గా నిలిచెవి. ఒక డిఫరెంట్ డైలాగ్స్ డెలివరీతో రావుగోపాలరావు చిరంజీవి గతంలో నటించిన అనేక సినిమాల బ్లాక్ బష్టర్ హిట్స్ కు సహకరించాడు అని చెప్పడంలో అతిసయోక్తి లేదు.ఇప్పుడు ఆతండ్రికి వారసుడుగా చిరంజీవితో ‘విశ్వంభర’ లో మాంత్రికుడుగా ఒక ఆట పట్టించబోతున్న సన్నివేశాలు ఆమూవీకి హైలెట్ గా మారుతాయి అని ఆశించడంలో ఎటువంటి సందేహం లేదు. చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా పడుగకు నాలుగు రోజులు ముందుగా జనవరి 10న విడుదల చేసి చిరంజీవి కెరియర్ లో 1000 కోట్ల సినిమాగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: