వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న శ్రీ విష్ణు తాజాగా "ఓం భీమ్ బుష్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించగా ...  శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మార్చి 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.  ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ కి ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు దక్కుతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.75 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 2.65 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు విడుదల అయిన 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.40 కోట్ల షేర్ ... 9.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 4 రోజుల్లో కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్ సీస్ లలో కలుపుకొని 1.70 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ సినిమాకు 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.10 కోట్ల షేర్ ... 13.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 9.30 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 10 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ క్లీన్ హిట్ గా నిలవాలి అంటే మరో 2.90 కోట్ల షేర్ కలక్షన్ లను వరల్డ్ వైడ్ గా రాబట్ట వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sv