కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటులలో సూర్య ఒకరు. ఈయన తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుడు అయినటువంటి ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన గజిని అనే మూవీ ద్వారా తెలుగు లో కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక అప్పటి నుండి ఈయన వరుసగా తాను నటించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తూ వస్తున్నాడు. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక విజయాలను తెలుగు బాక్సాఫీస్ దగ్గర అందుకొని తమిళ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఈ నటుడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న కంగువా అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ ... అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది.

మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చాలా బాగా పూర్తయింది. కాకపోతే ఇన్ని రోజుల పాటు ఈ మూవీ విడుదలకు సంబంధించి ఈ మూవీ యూనిట్ ఎలాంటి అప్డేట్ ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం వరల్డ్ వైడ్ గా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ లో ఇద్దరు సూర్యులు ఉన్నారు. వారిద్దరు కూడా చాలా డిఫరెంట్ గెటప్ లలో ఒకరికి సంబంధం లేకుండా ఒకరు ఉన్నారు. దానితో ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: