తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచు గుర్తింపును సంపాదించుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈయన కొన్ని సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

ఇకపోతే మళ్లీ ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే ఈయన "ప్రతినిధి 2" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. అలాగే ఈ సినిమాను కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. అలా ఒక మూవీ ని ప్రేక్షకుల ముందుకు తేవడానికి రెడీగా ఉన్నా నారా రోహిత్ తాజాగా మరో సినిమాకు సంబంధించిన అప్డేట్ ను కూడా విడుదల చేశాడు.

తాజాగా నారా రోహిత్ "సుందరాకాండ" అనే మూవీ లో హీరోక్గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించుకున్నాడు. ఇక తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ వెలువడింది. మరి ఈ మూవీ కి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. నారా రోహిత్ హీరో గా రూపొందనున్న ఈ మూవీ లో వ్రితి విజ్ఞాని , శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ లుగా నటించనుండగా ... వెంకటేష్ నిమ్మలపూడి ఈ మూవీ కి రచన మరియు దర్శకత్వం చేయనున్నాడు.

ప్రదేశ్ ఎం వర్మ ఈ సినిమాకు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనుండగా ... లియోను జేమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. రోహన్ చిల్లలే ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేయనుండగా ... సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించనున్నారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించబోతున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 6 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr