ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో కల్కి 2898 ఏడి , పుష్ప 2 , దేవర మూవీలు మొదటి స్థానంలో ఉంటాయి. ఈ మూవీ లపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు కూడా భారీ మొత్తంలో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ మూడు సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే , దిశ పటని హీరోయిన్ లుగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 350 కోట్ల వరకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అమితా బచ్చన్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... కమల్ హాసన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. దానితో ఈ సినిమాకు ఏకంగా 450 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: