ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమాలలో డబుల్ ఇస్మార్ట్ మూవీ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. అయితే గతంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాకి సీక్వల్ గా ఈ మూవీ రాబోతుంది అన్న విషయం తెలిసిందే. వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ రామ్ పోతినేని లకు ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ ఎంత సాలిడ్ విజయాన్ని అందించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఒకవైపు డైరెక్టర్ మరోవైపు హీరో కెరియర్ కి కూడా మంచి బూస్టప్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతూ ఉండడంతో.. భారీగానే అంచనాలు వెళుతున్నాయి అనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది. కాగా డబుల్ ఇస్మార్ట్ సినిమాకి అటు రామ్ పోతినేని ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈ మూవీ కోసం ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోలేదట హీరో రామ్. ఈ మూవీని రామ్ పోతినేని రెమ్యూనరేషన్ లేకుండానే చేస్తున్నట్లు సమాచారం  అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం లాభాల్లో వాటా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. అయితే పారితోషకం  ఇవ్వక పోవడం కారణంగా ఇటీవల డబుల్ ఇస్మార్ట్ సినిమా షూటింగ్ ఆపేశారు అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారగా.. ఇలా రామ్ పోతినేని ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదని లాభాలలో వాటా తీసుకునేందుకు అంగీకరించినట్లు ఇక మరో వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది  ఇందులో ఏది నిజం అన్నది మాత్రం ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: