ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రీ లీల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ యావరేజ్ విజయం అందుకున్నప్పటికీ ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అంతకుమించిన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈమెకు వరుసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ప్రస్తుతం ఈమె చేతలో అనేక సినిమాలు ఉన్నాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ ముద్దుగుమ్మ నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించగా , త్రివిక్రమ్ శ్రీనివాస్మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే గతంలోనే ఈమె తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని ఉన్నట్లు , ఒక మంచి పాత్ర దొరికితే ఖచ్చితంగా తమిళ్ సినిమా చేస్తాను అని ప్రకటించింది.

ఇకపోతే ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ "గోట్" అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతుందట. అందులో శ్రీ లీలను ఈ చిత్ర బృందం ఓకే చేసినట్లు , ఈమె కూడా అందులో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త వైరల్ అవుతూ ఉండడంతో శ్రీ లీల అభిమానులు ఒక మంచి పాత్రతో తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని , ఇలా ఐటమ్ సాంగ్ ద్వారా ఎంట్రీ  ఇస్తే ఆ తర్వాత కూడా సినిమాల్లో కూడా ఇలాంటి అవకాశాలే వస్తాయి అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: