ఒక లక్ష రూపాయలు మాత్రం పంచిన పల్లవి ప్రశాంత్ పెద్ద హనంగా చేశాడు. తన గురువు శివాజీతో పాటు వెళ్లి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. కట్ చేస్తే ఆ సహాయం హేసి రెండు నెలలు అవుతున్నా మరో సాయం చేయలేదు.మరోవైపు పల్లవి ప్రశాంత్ భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళితే రూ. 2 లక్షలకు పైగా తీసుకుంటున్నాడట. పల్లవి ప్రశాంత్ సంపాదన నెలకు రూ. 20 నుండి 30 లక్షలు అంటున్నారు.పల్లవి ప్రశాంత్ ఇచ్చిన మాట తప్పాడని అంటే గురువు శివాజీకి కోపం వచ్చింది. రాజకీయ నాయకులను కూడా ఇలానే నిలదీస్తారా అంటూ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ప్రైజ్ మనీ పంచకుండా ఉన్న పల్లవి ప్రశాంత్ ని మాత్రం ప్రశ్నించడం లేదు.ఇక సోషల్ మీడియాలో కామెంట్స్ రూపంలో పల్లవి ప్రశాంత్, శివాజీలను జనాలు ఏకి పారేస్తున్నారు. పేద రైతులకు ఎప్పుడు డబ్బులు పంచుతున్నారు? అసలు పంచుతారా లేదా? అని నిలదీస్తున్నారు. మరి పల్లవి ప్రశాంత్, శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి