ఆర్ ఆర్ ఆర్’ విడుదలై మూడు సంవత్సరాలు దాటిపోయినప్పటికీ తమ అభిమాన హీరో తారక్ నుండి మరొక సినిమా రాకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ అసంతృప్తిని తీర్చగలిగే మూవీగా ‘దేవర’ ఉంటుందని అభిమానుల అంచనా. వాస్తవానికి ‘దేవర’ ఈ సమ్మర్ లో రావలసి ఉంది.అయితే ఏప్రియల్ లో ఈ మూవీ విడుదలచేయాలని నిర్మాతలు భావించినప్పటికీ అప్పటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం తీవ్రస్థాయిలో ఉండటంతో భారీ బడ్జెట్ మూవీగా తీసిన ‘దేవర’ మూవీని అక్టోబర్ 10కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ సమయానికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణ వేడి పూర్తిగా తగ్గి పోతుందని మరికొందరి ఆలోచన.అయితే ‘దేవర’ విడుదల అయ్యే తేదీనాడు రజనీకాంత్ ‘వెట్టయాన్’ విడుదల అవుతోంది. వాస్తవానికి ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ పోటీని తట్టుకుని తెలుగు రాష్ట్రాలలో ‘వెట్టయాన్’ విడుదల అవ్వడం కష్టమైన పని. అయితే దీనితో జూనియర్ ఎన్టీఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి సమస్యలు లేకుండా విడుదల అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తమిళనాడు కర్ణాటకా కేరళ రాష్ట్రాలలో రజనీకాంత్ మూవీకి ఏర్పడిన భారీ క్రేజ్ రీత్యా తమిళనాడు కేరళ కర్ణాటక ప్రాంతాలలో ‘దేవర’ సినిమాకు ధియేటర్ల కొరత ఏర్పడవచ్చు అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. దీనితో వాయిదాపడే అవకాశం ఉన్న పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ విడుదల కావలసి ఉన్న సెప్టెంబర్ 27కు ‘దేవర’ ముందుకు జరగవచ్చు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి..  సెప్టెంబర్ 27న విడుదల కావలసి ఉన్న ఆ డేట్ ను టార్గెట్ చేస్తూ విడుదల కావలసిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు అని అంటున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజీ’ షూటింగ్ పూర్తి కావాలి అంటే ఇంకా కనీసం 20 రోజుల షూటింగ్ ఉంటుంది అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బిజీగా ఉంటున్న నేపధ్యంలో ‘ఓజీ’ మూవీ షూటింగ్ ను ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశంలేదు అని కొందరి  విశ్లేషకుల అభిప్రాయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: