తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటీవలే నటి హేమ బెంగళూరు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి ఒక్క సారిగా టాలీవుడ్ పరిశ్రమని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా కొన్ని రోజులుజైలు జీవితాన్ని గడిపిన హేమ బెంగళూరు జైలు నుంచి తాజాగా విడుదలైనట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో సినీనటి హేమ అరెస్టు అయ్యి విడుదల అయ్యింది. నిన్నటి రోజున ఆమెకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. గడచిన కొద్ది రోజుల క్రితం బెంగళూరులో ఒక ఫామ్ హౌస్ లో జరిగిన రేవు పార్టీలో హేమ మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు సైతం గుర్తించారు.


ఈ క్రమంలోనే ఆమెను బెంగళూరు సిటీ క్రైమ్ కంట్రోల్ పోలీసుల సైతం విచారించి అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. హేమకి బేయిల్ కూడా కోర్టు విడుదల చేసింది. ముఖ్యంగా హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవని ఆమె పైన ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని కూడా హేమ తరపున న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.


ముఖ్యంగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు దగ్గర ఎలాంటి సాక్షాలు లేవని ఈ విషయాన్ని హేమ లాయర్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే హేమ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆధారాలను సిసిబి న్యాయవాది కోర్టుకు అందించినట్లు తెలుస్తోంది. విరుపాక్షాల వాదనలు విన్న తర్వాత నటి హేమకు సైతం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా హేమ డ్రగ్స్ తీసుకోలేదని ముందు నుంచి చెబుతున్నప్పటికీ తాను బెంగళూరులో ఉన్నా సరే హైదరాబాదులో ఉన్నాను అంటూ ఒక వీడియోని విడుదల చేయడం ఒక చర్చనీయాంశం కు దారితీసింది. ఈ విషయంలోనే బెంగళూరు పోలీసులు సైతం సీరియస్ అయ్యి హేమ పైన విచారణ చేపట్టినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: