తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి మాణులలో విమల రామన్ ఒకరు. ఈమె దాదాపు పది సంవత్సరాల క్రితం వరుస సినిమా అవకాశాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించింది. ఆ సమయంలో ఈ బ్యూటీ కేవలం నటనతో మాత్రమే కాకుండా , ఎక్కువ శాతం తన అందాల ఆరబోతతో ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కించింది. కానీ ఈమె నటించిన సినిమాలు వరుసగా బోల్తా పడుతూ రావడంతో ఈమెకు అవకాశాలు చాలా వరకు తగ్గాయి. దానితో ఈమె మెల్లిమెల్లిగా ఇండస్ట్రీకి దూరం కూడా అయింది.

ఇక కొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె మళ్లీ చిన్న చిన్న సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఈ బ్యూటీ మరికొంత కాలంలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఈమె నటుడు వినయ్ రాయితో ఏడడుగులు వేయబోతుంది. వీరిద్దరూ ఎప్పటినుండో ప్రేమలో ఉన్నారు అని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయంపై ఇటు విమల రామన్ కానీ వినయ్ రాయి కానీ ఏ మాత్రం స్పందించలేదు.

దానితో ఇవన్నీ రూమర్స్ అని కూడా కొంత మంది అనుకున్నారు. కానీ ఆ వార్తలపై ఏ మాత్రం స్పందించని ఈ జంట గత నెలలో తమ లవ్ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా ధ్రువీకరించింది. పెళ్లయిన వాళ్లు దిగేలాగా ఫోటోషూట్ చేసి తమ సోషల్ మీడియా అకౌంట్లో వీరిద్దరూ పోస్ట్ చేశారు. అలాగే మరోవైపు విమల రామన్ కూడా నెట్టింట వరుసగా వినయ్ రాయితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

ఫోటోలు మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో వీడియోలను కూడా భారీగానే పోస్ట్ చేస్తుంది. దీంతో మరికొద్ది రోజుల్లోనే వీరు వివాహం చేసుకోబోతున్నారు అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరి కొంతమంది వీరింకా లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నారు. అందుకే పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు ఇంకా ఏమీ తీసుకోలేదు అని కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా విమల రామన్ , వినయ్ రాయ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు మాత్రం వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vr