కమల్ హాసన్ తాజాగా ఇండియన్ 2 అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చాలా సంవత్సరాల క్రితం విడుదల అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతుంది. ఇకపోతే ఇండియన్ సినిమా తెలుగులో భారతీయుడు అనే పేరుతో విడుదల అయ్యి ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమాని తెలుగులో భారతీయుడు 2 అనే పేరుతో విడుదల చేయనున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్ , కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర పెద్దగా ఉండదు అని ఈమెకి సంబంధించిన సన్నివేశాలు భారతీయుడు 2 లో ఉండబోతున్నట్లు శంకర్ కొన్ని రోజుల క్రితమే తెలిపారు. ఈ మూవీ ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో జులై 25 వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను ముంబై లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ సినిమా బృందం వారు ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సార్ బృందం నుండి "ఏ" సర్టిఫికెట్ లభించినట్లు సమాచారం.

మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను కూడా లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ 3 గంటల 10 నిమిషాల భారీ నిడిమితో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇలా భారతీయుడు 2 సినిమా అత్యంత భారీ నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సమాచారం. ఇక గతంలో శంకర్ దర్శకత్వంలో వహించిన చాలా సినిమాలు కూడా భారీ రన్ టైమ్ తోనే ప్రేక్షకులం ముందుకు వచ్చాయి. ఇక ప్రస్తుతానికి భారతీయుడు 2 సినిమాపై మంచి అంచనాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: