ప్రస్తుతం కేవలం పాన్ ఇండియా రేంజ్ లోని ప్రేక్షకులు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ కూడా ఎదురుచూస్తున్న సినిమా కల్కి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ పై ఉన్న అంచనాలు అంతా ఇంతా కాదు. ఏకంగా మైథాలజీకి సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్రిరిస్టిక్ అనే కాన్సెప్ట్ తో నాగ్ అశ్విన్ తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుదల కాబోతుంది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన రెండు ట్రైలర్లు కూడా సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయ్. అభిమానులు అందరిలో కూడా మూవీపై మరింత ఆసక్తిని పెంచేసాయి అని చెప్పాలి. హాలీవుడ్ సినిమాలను సైతం తలదన్నే రేంజ్ లో ఇక కల్కి మూవీ ఉండబోతుంది అన్నది తెలుస్తోంది. కాగా టాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా చాలా కాలం తర్వాత వస్తున్న భారీ సినిమా ఇదే కావడంతో.. ఇక ఈ మూవీ గురించి అన్ని భాషల ఆడియన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీలో నాగ్ అశ్విన్ క్రియేటివిటీ ప్రపంచ స్థాయి ఆడియన్స్ ని ఆకర్షించేలా ఉంది అనడంలో సందేహం లేదు.


 అయితే ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ తో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్, లోకనాయకుడు కమలహాసన్ లాంటివారు కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు దీపికా పదుకొనే దిశా పటాని లాంటి హీరోయిన్లు కూడా సినిమాలో అలరించబోతున్నారు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ లు చూసిన తర్వాత ఏకంగా ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కాస్త తక్కువ చేసి చూపించాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ప్రభాస్ లేనిదే కల్కి సినిమా లేదు అనే స్టేజ్ నుంచి.. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రను మరో రెండు పాత్రలు డామినేట్ చేస్తాయి అనేది రెండు ట్రైలర్లలో క్లియర్ గా చూపించాడు. ఆ పాత్రలు ఏవో కాదు అశ్వద్ధామ పాత్రలో నటించిన అమితాబచ్చన్, కమల్ హాసన్ పాత్రలు ప్రభాస్ రోల్ ని డామినేట్ చేయబోతున్నాయట. మరి దీనిని ఫాన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: