తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటలలో ఒకరు అయినటువంటి అల్లరి నరేష్ తాజాగా ఒకటి అడక్కు అనే ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించగా , మళ్లీ అంకం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ నటించిన ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి ప్రభావాన్ని చూపలేదు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల నష్టం వచ్చింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్స్ ఆఫీసర్ ముగిసే సరికి నైజాం ఏరియాలో ఒక కోటి కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 26 లక్షలు , ఉత్తరాంధ్రలో 35 లక్షలు , ఈస్ట్ గోదావరిలో 13 లక్షలు , వెస్ట్ గోదావరిలో 8 లక్షలు , గుంటూరులో 16 లక్షలు , కృష్ణ లో 23 లక్షలు , నెల్లూరులో 8 లక్షలు. మొత్తంగా తెలంగాణ , ఏపీ రాష్ట్రాలలో కలిపి 2.29 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 18 లక్షలు , ఓవర్సీస్ లో 14 లక్షలు. ఈ మూవీ కి మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 2.61 కోట్ల షేర్ కలక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 4.13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 4.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా దాదాపుగా 1.79 కోట్ల నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మూవీ తో పెద్ద స్థాయి అపజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: