పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా  పూరిని దారుణంగా దెబ్బ కొట్టింది. ఈ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. ఆ సినిమాకు ఉన్న బయ్యర్లు ఇంకా ఎగ్జిబిటర్లు చాలా ఘోరంగా నష్టపోయారు. ఈ మూవీని నైజాంలో పంపిణీ చేసిన వరంగల్ శీను లాంటి డిస్ట్రిబ్యూటర్లు అసలు అడ్రస్ లేకుండా పోయిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ రామ్‌తో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 15న మాస్ మహారాజా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాకు పోటీగా డబ్బులు ఇస్మార్ట్ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే లైగర్ సినిమా నష్టాలు డబుల్‌ ఇస్మార్ట్ రిలీజ్ ను బాగా ఇబ్బందులు పెడుతున్నట్టు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలోనే లైగర్ సినిమా బాకీలు ప్రముఖ నిర్మాత.. డిస్ట్రిబ్యూటర్ ఏసియన్ సునీల్ తీరుస్తారని దానికి బదులుగా పూరి జగన్నాథ్ ఆయనకు ఓ సినిమా చేయడానికి మధ్య ఒక అగ్రిమెంట్ కూడా ఒకే అయింది అంటూ రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఏషియన్ సునీల్ పూర్తిగా ఖండించడం జరిగింది. అసలు తనకు అసలు అలాంటి ఆలోచన లేదని.. తాను పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని అనుకుంటే అది డైరెక్ట్ గానే చేస్తాను కానీ లైగర్ సినిమా బాకీలతో తనకు సంబంధం లేదని సునీల్ ఖండించారని సమాచారం తెలుస్తుంది. 


తాను పూరి జగన్నాథ్ తో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్న మాట నిజమేనని.. అయితే అది ఇప్పుడు చేయట్లేదు అని సునీల్ చెప్పేశారు.అలాగే ఛాంబర్లో లైగర్ కారణంగా నైజాంలో.. విశాఖలో తలెత్తిన థియేటర్ల సమస్య గురించి కూడా సమావేశాలు మొదలైనట్టు సమాచారం తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ సినిమా తరఫున హీరో రామ్ పెదనాన్న నిర్మాత స్రవంతి రవి కిషోర్ రంగంలోకి దిగారు. పూరి - ఛార్మి తరపున ఆయన ఛాంబర్ లో వకల్తా పుచ్చుకుంటున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. అయితే పరిస్థితులనేవి మరీ అంత సానుకూలంగా లేవని కూడా సమాచారం తెలుస్తుంది. ఏది ఏమైనా కానీ లైగర్ సినిమా డిజాస్టర్ అనేది రామ్ - పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ ను డబుల్ కష్టాల్లోకి నెట్టిందని చెప్పాలి.ఇదిలా ఉంటే ఈరోజు బిగ్ బుల్ సాంగ్ ని ముంబైలో లాంచ్ చేయనున్నారు డబుల్ ఇస్మార్ట్ మూవీ మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: