తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల "హ్యాపీ డేస్" అనే సినిమాను రూపొందించాడు. వరుణ్ సందేశ్ , తమన్నా భాటియా , రాహుల్ హరిదాస్ , నిఖిల్ సిద్ధార్థ్ , వంశీ కృష్ణ , సోనియా దీప్తి , గాయత్రీ రావు , మోనాలీ చౌదరిమూవీ లో ప్రధాన పాత్రలలో నటించారు. 2007 వ సంవత్సరం విడుదల ఆయన ఈ సినిమా యువత మనస్సును ఎంతగానో దోచుకుంది. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులను కూడా అందుకుంది. మరి ఈ సినిమా ఎన్ని అవార్డులను అందుకుంది అనే వివరాలను తెలుసుకుందాం.

ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ 2008 కేటగిరీలో ఈ సినిమాకు
ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు విభాగంలో శేఖర్ కమ్ములకి అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ సహాయ నటి విభాగంలో సోనియా దీప్తి కి , ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో మిక్కీ జె. మేయర్ కి , ఉత్తమ గీత రచయిత విభాగంలో వనమాలి ( అరెరే అరెరే ) సాంగ్ కి , ఉత్తమ నేపథ్య గాయకుడి విభాగంలో కార్తీక్ ( అరెరే అరెరే ) సాంగ్ కి అవార్డ్ వచ్చింది.


నంది అవార్డులు – 2008 విభాగంలో ... రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - రజతం - శేఖర్ కమ్ముల కి దక్కగా , ఉత్తమ సంగీత దర్శకుడి విభాగంలో మిక్కీ జె మేయర్ కి , ఉత్తమ నేపథ్య గాయకుడి విభాగంలో కార్తీక్ ( ఓ మై ఫ్రెండ్ ) కి అవార్డ్స్ వచ్చాయి.


సినీమా అవార్డ్స్ - 2008 విభాగంలో ... ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకుడు , ఉత్తమ కథ , ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో శేఖర్ కమ్ములకి అవార్డ్స్ వచ్చాయి. ఉత్తమ సంగీతం విభాగంలో మిక్కీ జె మేయర్ కి ఉత్తమ గీత రచయిత విభాగంలో వనమాలి ( అరెరే అరెరే ) కి ,  ఉత్తమ గీత రచయిత విభాగంలో వేటూరి కి , 
ఉత్తమ గాయకుడి విభాగంలో కార్తీక్ ( అరెరే అరెరే ) సాంగ్ కి అవార్డు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: