మంచి ఫ్యామిలీ వివాదంలో మంచు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్ చేశారు. తన తండ్రి మోహన్ బాబు త‌న‌కు దేవుడు అని చెప్పారు. ఇప్పుడు కఠినంగా వ్యవహరిస్తున్న తండ్రి తన నాన్న కాదన్నారు .. తన తండ్రి ఇలా ప్రవర్తించరు అని మనోజ్ కామెంట్ చేశారు. కేవలం తన అన్న విష్ణు మరో వ్యక్తి వల్లే తండ్రి మోహన్ బాబు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు మనోజ్ ఆరోపించారు. తన తండ్రి భుజాలపై గ‌న్ పెట్టి వాళ్ళిద్దరూ తనతో పాటు తన భార్య పై పిలుస్తున్నారని మనోజ్ మండిపడ్డారు . ఈ ఎపిసోడ్లో నిజాలు ఏంటో ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు బయట పెడతానని మనోజ్ చెప్పారు. దీంతో మ‌నోజ్ ఏం చెపుతారా ? అన్న ఆస‌క్తి అంద‌రి లోనూ ఉంది.


ఇక ప్రేమించి పెళ్లి చేసుకోవడం తాను చేసిన నేరమా ? అని మనోజ్ ప్రశ్నించారు. తన భార్యపై నిందలు వేయటం ఎంత వరకు ? . . కరెక్ట్ అని మనోజ్ నిలదీశారు. ఇదే తన భార్య తల్లిదండ్రులు ఉంటే ఊరుకునే వారా ? అని మనోజ్ ప్రశ్నించారు. తన భార్య కు తల్లి .. తండ్రి అన్ని తానే అని అన్నారు. ఆమెకు తను అండగా ఉంటానని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులపై తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని మనోజ్ కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు. ఇదిలా ఉంటే దివంగత నేతలు భూమా నాగిరెడ్డి - శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక రెడ్డికి అంతకుముందే ఒక వివాహం జరిగి ఒక కుమారుడు జన్మించారు.


అయితే ఆ దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు చిన్ననాటి మిత్రుడు అయిన మనోజ్ ప్రేమలో పడిన మౌనిక ఆ తర్వాత పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లి మోహన్ బాబుకు ... మంచు విష్ణుకు ఇష్టం లేకపోయినా మనోజ్ సోదరి లక్ష్మీప్రసన్న కీలకంగా వ్యవహరించి దగ్గరుండి మరి పెళ్లి చేసిన సంగతి అప్పట్లో సంచలం రేపిన‌ సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: