సినిమాల్లోకి రాకముందు శ్రద్ధా మోడలింగ్ రంగంలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళంలో 'కోహినూర్' సినిమాతో నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. కొన్నాళ్లకు కన్నడ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా కన్నడలో సూపర్ హిట్ అయిన 'యూ టర్న్' సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేసినప్పుడు కూడా శ్రద్ధానే హీరోయిన్‌గా నటించడం విశేషం.
'జెర్సీ' సినిమాతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధా ఆ తర్వాత 'జోడి', 'కృష్ణ అండ్ హిస్ లీల' వంటి సినిమాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇటీవల విక్టరీ వెంకటేష్‌తో కలిసి 'సైంధవ్' సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం శ్రద్ధా శ్రీనాథ్ కెరీర్ మంచి ఊపు మీద ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమాలో ఆమె హీరోయిన్‌గా ఎంపికైంది. రీసెంట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న 'మెకానిక్ రాకీ' సినిమాలోనూ శ్రద్ధా కనిపించింది. ఈ సినిమా పర్లేదనిపించింది.
మరోవైపు, సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ 'జైలర్' సీక్వెల్ గురించిన ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. 'జైలర్ 2'లో శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషించనుందనే టాక్ నడుస్తోంది. గతంలో ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి నటిస్తుందని వార్తలు వచ్చినా, ఇప్పుడు శ్రద్ధా పేరు బలంగా వినిపిస్తోంది. 'జైలర్ 2' కథలో ఆమె పాత్ర చాలా ముఖ్యమైనదని సమాచారం.
ఇలా వరుస సినిమాలతో, విభిన్నమైన పాత్రలతో శ్రద్ధా శ్రీనాథ్ సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. ఆమె రాబోయే సినిమాల కోసం, పాత్రల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి