ఏంటి ఆ హీరో తాగి అమ్మాయిలతో తిరిగారా.. ఇది నిరూపిస్తే ఆస్తంత రాసిస్తానని రెబల్ స్టార్ చెప్పారా.. ఇంతకీ రెబల్ స్టార్ అంటే ప్రభాసా లేక కృష్ణంరాజా అనే మీ అనుమానాలు మీ అందరిలో ఉంటాయి.మరి ఇంతకీ ఈ మాటలు మాట్లాడిన ఆ రెబల్ స్టార్ ఎవరో ఇప్పుడు చూద్దాం.. ఈ కామెంట్ చేసిన రెబల్ స్టార్ ఎవరో కాదు సీనియర్ దివంగత నటుడు కృష్ణంరాజు.. ప్రభాస్ సినిమాల్లోకి వచ్చిందే తన పెదనాన్న కృష్ణంరాజుని ఇన్స్పైరింగ్ గా తీసుకొని.అయితే ప్రభాస్ తండ్రి కూడా సినిమాల్లోనే కొనసాగినప్పటికీ ఆయన మరణించడంతో ప్రభాస్ బాధ్యతలన్నీ కృష్ణంరాజు తీసుకున్నారు.అయితే అలాంటి కృష్ణంరాజు చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయనకు సంబంధించి ఎన్నో విషయాలు మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.

అలా గతంలో కృష్ణంరాజు మాట్లాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ఇక  ఆ వీడియోలో ఏముందంటే..చాలామంది హీరో హీరోయిన్లకు తాగుడు అలవాటు ఉంటుంది. అలా నాకు కూడా తాగే అలవాటు ఉంది. కానీ నేను ఇప్పటివరకు తాగి ఎవరిని కూడా తిట్టలేదు. సినిమా షూటింగ్ సెట్ కి తాగి వచ్చి ఏ ఆర్టిస్టుని కూడా దుర్భాషలాడుతూ నిందించలేదు. నాకు పేకాట, సిగరెట్ తాగడం వంటి చెడు అలవాట్లు కూడా లేవు. అలాగే అమ్మాయిలని టార్చర్ చేయడం హీరోయిన్లతో తిరగడం వంటి చెడ్డ అలవాట్లు నాకు లేవు. ఒకవేళ ఇలాంటి చెడు అలవాట్లు నాకు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే నా ఆస్తి అంతా రాసిస్తా ఇదే నా చాలెంజ్.. ఇక సినిమాల వల్ల కొంత మంది నష్టపోయిన వారు ఉంటారు. కొంతమంది లాభపడ్డ వారు ఉంటారు. 

అయితే సినిమాల వలన నా జీవితం బాగానే సెట్ అయింది. కానీ ఆ తర్వాత గ్రానైట్ బిజినెస్ చేయడం వల్ల నష్టాల పాలయ్యాను. ఇక మాది రాజ వంశీయుల కుటుంబం కాబట్టి ఇంట్లో కోట్లకు కోట్ల డబ్బులు ఉంటాయని అనుకుంటారు. కానీ మేము అలా కాదు వచ్చిన డబ్బును వచ్చినట్లే ఖర్చు చేస్తాం. మేం చాలా రిచ్. కానీ ఒకసారి మేకప్ వేసుకొని షూటింగ్ సెట్లోకి అడుగుపెడితే నేను కృష్ణంరాజుని అనే విషయాన్ని మర్చిపోతాను. సినిమా పైనే నా పూర్తి ఫోకస్ ఉంటుంది. మా కుటుంబంలో చాలామంది పేకాట ఆడేవారు. కానీ నాకు మాత్రం  ఆ అలవాటు లేదు.40 ఏళ్లుగా నాకు డ్రింకింగ్ అనే బ్యాడ్ హాబిట్ తప్ప మరో అలవాటు లేదు అంటూ కృష్ణంరాజు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: