
ఇక ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా భాగమైందని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమా పోస్టర్ లు, టీజర్ లు కూడా ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా పాటలు కూడా మంచి స్పందన పొందాయి. దీంతో కన్నప్ప మూవీపైన ప్రేక్షకులు మరింత అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం మూవీ మేకర్స్ చాలానే ప్రమోషన్స్ చేస్తున్నారు. కన్నప్ప సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. కన్నప్ప సినిమాలో అక్షయ్ కుమార్ శివయ్యగా, కాజల్ పార్వతిగా, ప్రభాస్ రుద్రుడిగా, మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా, రఘుబాబు మల్లుగా, శివ బాలాజీ కుమారదేవ శాస్త్రిగా కనిపించనున్నారు.
అయితే ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రజలు ఇకపైన నటులను దక్షిణ నటుడు, ఉత్తర నటుడు అని వేరుగా చూడారు. ప్రేక్షకులు నటులందరిని తమ సొంత ఇంటి మనుషుల్లా చూడడం మొదలుపెట్టారు. ప్రస్తుతం సినిమాలకు ఎక్కువ ప్రేమ, డబ్బు ఉత్తరాది నుంచి వస్తుంది. దాన్ని మనం గౌరవించాలి.. అలాగే అంగీకరించాలి' అని చెప్పుకొచ్చారు.