మొదటిసారి ఒక లైలా కోసం అనే చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ పూజా హెగ్డే.. తన ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో నటించి ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించింది. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకోవడంతో బాలీవుడ్లో కూడా పలు చిత్రాలలో నటిస్తోంది. అయితే ఒక్కసారిగా టాలీవుడ్ లో పూజా హెగ్డే కి ప్లాపులు ఎదురవ్వడంతో ఒక్కసారిగా  ఈమె కెరియర్ కూడా పడిపోయింది. వీటికి తోడు యంగ్ హీరోయిన్స్ కూడా స్టార్ స్టేటస్ ని అందుకోవడంతో పూజ హెగ్డే క్రేజ్ తగ్గిపోయింది.


దీంతో ఒక్కసారిగా పూజా హెగ్డే ఐరన్ లెగ్గానే బిరుదుని సంపాదించుకుంది. దీంతో సినిమా అవకాశాలు కూడా నెమ్మదిగా కరువయ్యాయి. అలా కొన్ని నెలలపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా మళ్లీ  రీ యంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. ఏకంగా నాలుగైదు చిత్రాలతో కూడా ప్రేక్షకులను అల్లరించడానికి సిద్ధమైంది. నిరంతరం సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలతో వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది పూజా హెగ్డే.


అయితే తాజాగా పూజ హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో వరుణ్ దావన్ బర్తడే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేస్తూ లవ్ హార్ట్ సింబల్ తో చేతులను జోడించి మరి ఫోటోలను సైతం షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నేటిజన్స్ ఏంటి మీ మధ్య ఏదైనా సంథింగ్ గా అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇలా లవ్ సింబల్ ఫోటోలు మరొకసారి పూజ హెగ్డే పేరు మాత్రం వైరల్ గా మారుతున్నది. సూర్యతో నటించిన రెట్రో సినిమా త్వరలో రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: