ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా స్టార్ సెలబ్రిటీస్ ల లైఫ్ లో కీలకపాత్ర పోషిస్తుంది . మరీ ముఖ్యంగా సినీస్టార్స్ విషయంలో సోషల్ మీడియా హైలెట్గా వ్యవహరిస్తుందని చెప్పాలి.  తాజాగా సోషల్ మీడియాలో ఓ పేరు విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అదే విజయ్ దేవరకొండ . టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా "రెట్రో" అనే మూవీ తెరకెక్కింది. మే 1 వ తేది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.


సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా వచ్చి అందరిని అట్రాక్ట్ చేశారు . ఇదే మూమెంట్ లో సినిమా కన్నా కూడా ఆయన జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిపై స్పందించారు . కూసింత ఘాటు పదాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏకీపారేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు తాలూకా వీడియో బాగా వైరల్ గా మారింది.  అయితే నిన్న మొదటి వరకు  విజయ్ దేవరకొండ గురించి పట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు . ఆయన ఫ్యాన్స్ మాత్రమే ఆయనకి సంబంధించిన విషయాల పై రియాక్ట్ అవుతూ వచ్చారు.



మిగతా జనాలు సైలెంట్ అయిపోయారు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన "ఫ్యామిలీ స్టార్" తర్వాత విజయ్ దేవరకొండకు సోషల్ మీడియాలో సొంత నెగిటివిటీ ఎక్కువగా వచ్చింది. అయితే రాత్రికి రాత్రి విజయ్ దెవరకొండ తల రాత మారిపోయింది . విజయ్ దేవరకొండ పేరుని మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాలే చేసింది ఆయన తాజాగా మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే విజయ్ దేవరకొండ ని డేరింగ్ ఉన్న హీరో అంటూ పొగిడేస్తున్నారు . అంతేకాదు విజయ్ దేవరకొండ లాంటి హీరో ఇండస్ట్రీలో ఒక్కరైనా ఉండాలి అంటూ ప్రశంసిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: