సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన వారు చాలామంది ఉన్నారు. భూమి పడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ సింగ్ వీళ్లంతా.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వారే. వీళ్ళతో పాటు.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ముద్దుగుమ్మ కూడా అదే బ్యాక్ గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే.. దాదాపు 16 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎప్పటి వరకు కేవలం ఏకైక హీట్‌ను అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కించుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మ‌డు దాదాపు ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో కలిసి నటించినా.. స‌రైన సక్సెస్ మాత్రం అందలేదు.
 

ఈ క్రమంలోనే మెల్లమెల్లగా అవకాశాలకు దూరమైన ఈ అమ్మడు.. నటనతో మాత్రం తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు హీరోయిన్ నేహా శర్మ. 2007లో చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. మెగా పవర్ స్టార్ చరణ్ నటించిన ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా తర్వాత 2009లో కుర్రాడు సినిమాలో నటించిన పెద్ద సక్సెస్ అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత 2010లో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నేహా శర్మ.. క్రూక్‌ సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది.

 

సినిమా తర్వాత నేహా శర్మకు ఎన్నో సినిమాల ఆఫర్లు క్యూ క‌ట్టాయి. కానీ.. ఈ సినిమాలో ఏది అమ్మడుకు సరైన సక్సెస్ అందించలేకపోయాయి. అలా 16 ఏళ్ల సినీ కెరీర్‌లో కేవలం క్రూక్ సినిమాతో మాత్రమే బ్లాక్ బస్టర్ అందుకున్న నేహా.. ఆస్తులు మాత్రం బానే కూడబెట్టింది. ప్రస్తుతం అమ్మడి నిక‌ర‌ ఆస్తులు రూ.22 కోట్లని టాక్. ఇక 2020 నుంచి ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది. కాగా నేహా తండ్రి అజిత్ శర్మ.. బిహార్‌ శాసనసభలో భాగల్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నో సార్లు ఎమ్మెల్యేగా ఎంపికయ్యాడు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన రాజకీయ పరంగా సక్సెస్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: